close
Choose your channels

ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న 'రక్షకభటుడు'

Friday, March 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'రక్ష' ఓ సస్పెన్స్‌ హర్రర్‌... 'జక్కన్న' మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌... కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్‌ చేసుకుని ఆల్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం 'రక్షకభటుడు' వంటి డిఫరెంట్‌ టైటిల్‌తో ఫాంటసీ ధ్రిల్లర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ ఫాంటసీ చిత్రం 'రక్షక భటుడు` ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``మా ర‌క్ష‌క‌భటుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్నీ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారు క‌థే హీరోగా ర‌క్ష‌క‌భ‌టుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. అర‌కు లోయ నేప‌థ్యంలో రూపొందించిన ఈ సినిమాలో దేవుడు ఓ దెయ్యాన్ని కాపాడుతాడు..అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ర‌క్ష‌క‌భటుడు సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ``సినిమాకు అండర్‌ ప్రొడక్షన్‌లోనే ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ఇటీవల రిలీజ్‌ అయిన ఫస్ట్‌ పోస్టర్‌కి, టీజర్‌కి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్క టీజర్‌తోనే ఫ్యాన్సీ రేటుకి హిందీ వెర్షన్‌ హక్కులు అమ్ముడవటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సాధార‌ణంగా పోలీస్‌ను 'రక్షక భటుడు` అంటుంటాం. ఈ చిత్రంలో ఎవర్ని ఎవరు ప్రొటెక్ట్‌ చేస్తారు? ఎందుకు ప్రొటెక్ట్‌ చేయాలన్నదే మా కాన్సెప్ట్‌. ఆ ప్రొటెక్ట్‌ చేసే ఎనర్జీయే 'రక్షక భటుడు'. కాబట్టి సినిమాకి ఆ టైటిల్‌ పెట్టాం. ఆంజనేయ స్వామి ఒక రక్షక భటుడుగా ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. పోలీస్‌ స్టేషన్‌లో జరిగే ఒక ధ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌. ఆ ధ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ ఏమిటనేది 'రక్షకభటుడు' సినిమా చూడాల్సిందే`` అన్నారు.
రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌, నందు, చిత్రం శ్రీను,స‌త్తెన్న‌, జ్యోతి, కృష్ణేశ్వర్‌రావు, మ‌ధు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.