close
Choose your channels

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ'

Sunday, October 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `ధృవ` మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్లో `మగధీర` తర్వాత రూపొందుతోన్న ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. న‌వంబ‌ర్ మొద‌టివారంలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ పూర్త‌వుతుంది. ఒక పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ నుండి మెగాభిమానులు, ప్రేక్ష‌కుల అటెన్ష‌న్‌ను త‌న‌వైపు తిప్పుకున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. సినిమా ఆడియో వివరాల‌ను నిర్మాత‌లు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు. అలాగే అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ధృవ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

`నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే..నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది...
నీ శ‌త్రువు ఎవ‌రో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది` అంటూ చ‌ర‌ణ్‌ చెప్పిన డైలాగ్ తో ఉన్న ఈ యాభై సెకన్ల‌ ఈ టీజ‌ర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ తమిళా (ఆది), ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.