close
Choose your channels

మెగాభిమానులకు చరణ్ గిఫ్ట్

Sunday, July 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985`. సినిమా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ బావుంద‌ని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న విడుద‌ల చేస్తార‌ట‌. మెగాభిమానుల‌కు చిరంజీవి పుట్టినరోజు గిఫ్ట్ అయ్యేలా టీజ‌ర్‌ను క‌ట్ చేస్తున్నారు. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నాట‌కాల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాను రాజ‌మండ్రిలో ఓ గ్రామంలో చిత్రీక‌రించారు. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.