close
Choose your channels

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక

Thursday, July 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 15న జరుగనున్న ఈ చిత్ర పాటల వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా పాటలు విడుదలకానుండటం మాకెంతో ఆనందంగా వుంది అని తెలిపారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.