close
Choose your channels

పురాణ పాత్రలో రానా....

Wednesday, June 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. కెరీర్ ప్రారంభం నుండి ప్ర‌తి పాత్ర, విల‌క్ష‌ణంగా ఉండాల‌నుకునే రానా, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని క‌థ‌ల‌న ఎంపిక చేసుకుంటున్నాడు. అందుకే తెలుగు ప్రేక్ష‌కులకే కాదు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా రానా సుప‌రిచితుడే. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇలా భిన్నమైన బాటలో సాగుతున్న రానా, ఓ పౌరాణిక సినిమాలో నటించడానికి అంగీకరించాడని ఫిలింనగర్‌లో వార్తలు వినపడుతున్నాయి.
'రుద్రమదేవి' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు గుణశేఖర్‌. ఇప్పుడు 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రంలో టైటిల్‌ పాత్ర కోసం రానాను సంప్రదించాడట. రానా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇప్ప‌డు రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `నేనే రాజు నేనే మంత్రి` సినిమాలో న‌టించాడు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రానా ఫైనాన్సియ‌ర్‌, పొలిటీషియ‌న్ జోగింద‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు. జోగింద‌ర్ భార్య పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.