close
Choose your channels

బాహుబలి 2 పక్కన పెట్టిన రానా..?

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రానా. అంద‌రు బాహుబ‌లి 2 ఎప్పుడు వ‌స్తుందా అని ఆలోచిస్తుంటే...రానా మాత్రం ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 గురించి ఆలోచించ‌డం లేద‌ట‌. ఇంత‌కీ రానా బాహుబ‌లి 2 గురించి ఆలోచించ‌కుండా మ‌రి దేని గురించి ఆలోచిస్తున్నార‌నుకుంటున్నారా..? బాహుబ‌లి 2 కంటే ముందు రానా ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్ ఈ సినిమాకి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాని ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించ‌నున్నారు.రొమాంటిక్ యాక్ష‌న్ ల‌వ్ స్టోరిగా రూపొందే ఈ సినిమాలో రానా స‌ర‌స‌న రెజీనా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబ‌లి 2 ప్రారంభం అయ్యేలోపు మూడు నెల‌లోనే ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.