close
Choose your channels

భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో రానా

Tuesday, November 17, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి చిత్రంతో బాగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి ప్రారంభించ‌నున్నారు. రానా బాహుబ‌లి 2 తో పాటు బెంగుళూరు డేస్ త‌మిళ రీమేక్ లో కూడా న‌టిస్తున్నాడు.

తాజాగా రానా త‌మిళ్ లో రూపొందే భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో రానా తో పాటు విశాల్, ఆర్య‌, అర‌వింద్ స్వామి, ఆధ‌ర్వ న‌టించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని శివ పుత్రుడు, వాడు వీడు, నేను దేవుణ్ణి..త‌దిత‌ర చిత్రాల‌ను తెర‌కెక్కించిన బాల తెర‌కెక్కించ‌నున్నారు. త‌మిళ్ లో వివాద‌స్ప‌ద‌మైన కుట్ర ప‌రంబ‌రై న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.