close
Choose your channels

రానా - తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'నేనే రాజు - నేనే మంత్రి'

Sunday, May 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌రికొత్త క‌థ‌ల్ని, ఊహ‌కు అంద‌ని పాత్ర‌ల్నీ ఎంచుకొంటూ... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు రానా. `బాహుబ‌లి`లో భ‌ళ్లాల‌దేవ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌శంస‌లు అందుకొన్న రానా... `ఘాజీ`లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలోనూ త‌న‌దైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కుల ద‌గ్గ‌ర మార్కులు కొట్టేశాడు. అంతే కాదు... త‌న మార్కెట్‌నీ అంత‌కంత‌కూ విస్త‌రించుకొంటున్నాడు. తాజాగా.. తేజ ద‌ర్శ‌క‌త్వంతో రూపుదిద్దుకొంటున్న `నేనే రాజు - నేనే మంత్రి`పైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో జోగేంద్ర‌గా మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించుకోబోతున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా.. అని ఎప్పుడైతే ప్ర‌క‌ట‌న వెలువ‌డిందో, అప్ప‌టి నుంచీ ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది చిత్ర‌సీమ‌. ఇప్పుడు చిత్రీక‌ర‌ణ సైతం తుది ద‌శ‌కు చేరుకొంది. ఈ చిత్రానికి `నేనే రాజు నేనే మంత్రి` అనే టైటిల్‌ని అధికారికంగా ధృవీక‌రించింది చిత్ర‌బృందం. చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్ లో సాగుతోంది మ‌రో వైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలూ న‌డుస్తున్నాయి.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ `` తేజ‌గారు క‌థ చెప్పిన‌ప్పుడే క‌చ్చితంగా రానా కెరీర్‌లో ఓ విభిన్న‌మైన చిత్రం అవుతుంద‌నిపించింది. క‌థ అంత కొత్త‌గా ఉంది. రానాలోని న‌టుడు మ‌రో కొత్త అవ‌తారంలో క‌నిపించ‌డానికి ఆస్కారం దొరికింది. తెలుగు,త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాం. `నేనే రాజు - నేనే మంత్రి` అనే టైటిల్‌ని ఈ సంద‌ర్భంగా అధికారికంగా ప్ర‌క‌టిస్తున్నాం. టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌... అతి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు తేజ మాట్లాడుతూ `` మ‌న చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతున్నా మ‌నం ప‌ట్టించుకోం. ఎవ‌రి ఆక్రంద‌న‌లు వినిపించ‌వు. ఏ అవ‌మానాలూ క‌నిపించ‌వు. పోతే పోనీ అనుకొంటూ కాలం గ‌డిపేస్తుంటాం. ద‌శాబ్దాలుగా మ‌నం ఇలానే బ‌తికేస్తున్నాం. ఈ దృక్ప‌థాన్ని మార్చే చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`. రానా పాత్ర స‌రికొత్త ఆలోచ‌న‌ల్ని రేకెత్తిస్తుంది. స‌మాజంలో మార్పుని తీసుకొస్తుంది. అదెలా అనేది వెండితెర‌పై చూడండి`` అన్నారు.

క‌థానాయ‌కుడు రానా మాట్లాడుతూ `` అన్ని విధాలుగానూ ఇదో అత్యుత్త‌మ స్క్రిప్ట్‌. మ‌న ఆలోచ‌నా దృక్ప‌థాన్ని మార్చేసే సినిమా ఇది. తేజ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆక‌లి.. ఇవ‌న్నీ ఏళ్లుగా చూస్తూనే ఉన్నా. ఆయ‌న‌కు నేను అభిమానిని. తేజ ఆక‌లే కాదు.. మా అంద‌రి ఆక‌లీ తీర్చే చిత్ర‌మిది`` అన్నారు రానా.

రానా, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంగీతం: అనూప్ రూబెన్స్ ఛాయాగ్ర‌హణం: వెంక‌ట్ సి.దిలీప్‌, కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు క‌ళ‌: నారాయ‌ణ రెడ్డి రచన: పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ నిర్మాత‌లు: సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు: అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల స‌మ‌ర్ప‌ణ‌: డి. రామానాయుడు క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.