close
Choose your channels

బాహుబలి 2 రికార్డుల పరంపర...వర్మ కౌంటర్....

Friday, March 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి...ఈ పేరుతో తెలుగు సినిమా రేంజ్‌ను ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, స‌త్య‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన ఈ చిత్రం రెండో భాగం బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ క‌నువిని ఎరుగ‌ని రీతిలో స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ గ‌త 24 గంట‌లుగా సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తుంది. ఎంత‌లా అంటే అన్నీ భాష‌ల ట్రైల‌ర్స్‌, అన్నీ సోష‌ల్ మీడియాస్‌లో క‌లిపితే 24 గంట‌ల్లో 50 మిలియ‌న్స్ వ్యూస్‌ను దాటింది.
5 కోట్ల వ్యూస్‌ను రాబట్టుకుని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా క్రియేట్ చేయ‌ని విధంగా కొత్త రికార్డుల‌కు నాంది ప‌లికింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేయ‌డం విశేషం. అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు, ట్రైల‌ర్‌ను ఇంత‌లా ఆద‌రించిన వారంద‌రికీ థాంక్స్ అనే చిన్న మాట చెబితే స‌రిపోద‌ని రాజ‌మౌళి పెర్కొన్నాడు. అయితే ఈ నంబ‌ర్ చూస్తుంటే అస‌లు బాహుబ‌లి 2పై ఉన్న అంచ‌నాలనెలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. రామ్‌గోపాల్ వ‌ర్మ బాహుబ‌లి 2 ట్రైల‌ర్ సాధించిన కొత్త రికార్డ్ నంబ‌ర్ చూసి టాలీవుడ్‌లో ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటారోన‌ని వ్యాఖ్యానించాడు. బాహుబ‌లి 2 ట్రైల‌ర్ త‌ర్వాత మెగా ఫ్యామిలీని, మెగాభిమానుల‌ను త‌న‌దైన శైళిలో ఉటంకిస్తున్న వ‌ర్మ‌కు ఈ న్యూస్ ఇంకా బ‌లాన్నిచ్చిన‌ట్ట‌య్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.