close
Choose your channels

2.0 క్లైమాక్స్ పూర్తి....

Tuesday, October 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్‌గా పూర్త‌య్యింది. స్టంట్ సిల్వ అధ్వ‌ర్యంలో ఈ ఫైట్‌ను ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌ల మ‌ధ్య చిత్రీక‌రించారు. గ‌తంలో ర‌జ‌నీకాంత్ శివాజీ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన సిల్వ ఈ సినిమాకు కూడా ర‌జ‌నీకాంత్‌తో వ‌ర్క్ చేయ‌డం ప‌ట్ల త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అవుతుంద‌ని తెలియ‌జేశారు. ఈ షెడ్యూల్‌లోనే ర‌జ‌నీకాంత్‌, ఎమీ జాక్స‌న్‌ల మ‌ధ్య ఓ సాంగ్‌ను కూడా చిత్రీక‌రించ‌డానికి శంక‌ర్ స‌న్నాహాలు చేస్తున్నాడు.

2.0 చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని శంక‌ర్ అండ్ టీం భావిస్తుంద‌ట‌. ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌గా అంద‌రినీ అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని అంటున్నారు యూనిట్ స‌భ్యులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.