close
Choose your channels

సంక్రాంతికి రోబో సీక్వెల్ '2.0' టీజర్

Thursday, October 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. 300 కోట్లకు పైగా భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. హై బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 2010లో విడుద‌లై స‌న్సేష‌న్ క్రియేట్ చేసిన రోబోను మించేలా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు శంక‌ర్‌.
సినిమా క్ల‌యిమాక్స్‌ఫైట్‌, ర‌జ‌నీకాంత్‌, ఎమీ జాక్స‌న్‌ల‌పై ఓ సాంగ్‌ను రీసెంట్‌గా చిత్రీక‌రించారు. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను న‌వంబ‌ర్ 20న విడుద‌ల చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.