close
Choose your channels

'రుద్రమదేవి' వెనకుడుగు...

Monday, October 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి`. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే మధ్యలో బాహుబలి` వంటి భారీ సినిమా రిలీజ్ వల్ల థియేటర్స్ సమస్య, చిన్న చిన్న టెక్నికల్ డెవలప్ మెంట్స్, ఆర్ధిక సమస్యలు అన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి.

చివరికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా తెలియజేశారు. 2D,3D ఫార్మెట్స్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తామని దర్శక నిర్మాత గుణశేఖర్ చెప్పి రోజైనా గడవకముందే తమిళంలో సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న తేనాండల్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఈ విడుదల తేదీ కేవలం తమిళానికే పరిమితం అవుతుందా? లేక తెలుగు, హిందీ, మలయాళంలో కూడా మారుతుందా అని తెలియాల్సి ఉంది. చూద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.