close
Choose your channels

'సాహో' బాహుబలి

Sunday, April 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబ‌లి2 సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాను వీలైనంత త‌ర్వగా సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. యు.వి.క్రియేష‌న్స్ ఈ సినిమాను రూపొందించ‌నుంది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకుంది.

ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బ్యాట్స్ ఈ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేయ‌నున్నాడ‌ట‌.ఈ సినిమా ట్రైల‌ర్‌ను `బాహుబ‌లి 2` సినిమా థియేట‌ర్స్ ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చేలా ముందుగా ట్రైల‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయ్యాడు. ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ నిర్మాత‌లు ఆ ఫేమ్‌ను వాడుకోనున్నారు. ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం వంద‌కోట్ల పై బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాను మూడు భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.