close
Choose your channels

సమంత అంటే ఎనర్జీ.. నిత్యా అంటే గౌరవం..

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్కో క‌థానాయిక‌లో ఒక్కో మంచి గుణం ఉంటుంది. అది వారితో క‌లిసి ప‌నిచేసే వారి మాటల్లో అప్పుడ‌ప్పుడు సంద‌ర్భానుసారంగా బ‌య‌ట‌కి వ‌స్తుంది. ఇప్పుడు ఇలానే ఇద్ద‌రు ప్ర‌ముఖ‌ క‌థానాయిక‌ల గురించి ఓ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఆ క‌థానాయిక‌లు స‌మంత, నిత్యా మీన‌న్ కాగా.. క‌థానాయ‌కుడు సూర్య‌.

సోమ‌వారం ఉద‌యం చెన్నైలో జ‌రిగిన '24' ఆడియోలో ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌పై సూర్య ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. స‌మంత ఎప్పుడూ ఎనర్జీతో ఉంటుంద‌ని.. ఆమెలోని ఆ ఎన‌ర్జీ త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పాడు సూర్య‌. ఇక నిత్యా మీన‌న్ గురించి మాట్లాడుతూ పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఆ పాత్ర కోసం క‌ష్ట‌ప‌డే గుణం చూస్తే నిత్యాపై గౌర‌వం పెరిగింద‌ని చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.