close
Choose your channels

వెండితెరపై మెరవనున్న సానియా?

Tuesday, June 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రీడల్లో టెన్నిస్‌కి ఓ ప్రత్యేక స్థానం వుంది. ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ క్రీడాకారులకు అభిమానులుంటారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల్లో స్టెఫీగ్రాఫ్‌లాంటి వారు ఈ ఆటకు ఓ గ్లామర్‌ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వస్తే ఆ బాధ్యతను భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఎక్కువ. గ్లామర్‌ అనేది సినిమాకి మాత్రమే పరిమితం కాదని, క్రీడాకారులు కూడా సినిమాల్లో రాణిస్తారని అనేక సందర్భాల్లో ప్రూవ్‌ చేశారు.
అలా ఇప్పుడు సానియా మీర్జా కూడా సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతోందని తెలుస్తోంది. వ్యాపార ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే సానియా ఇప్పుడు వెండితెరపై ప్రత్యక్షం కాబోతోంది. బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలియజేశాడు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది వెలుగులోకి రాకపోయినా ఫర్హాన్‌ చేసిన ట్వీట్‌కి సానియా థాంక్స్‌ చెప్పిందట. సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్‌ మీర్జాల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. అంటే త్వరలోనే సానియా వెండితెరపై మెరవబోతోందన్నమాట. ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.