close
Choose your channels

శ్రీశాంత్ తో జతకడుతున్న శాన్వీ..

Friday, November 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదితో ల‌వ్ లీ, సుశాంత్ తో అడ్డా, విష్ణుతో రౌడీ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న హీరోయిన్ శాన్వీ. ఆత‌ర్వాత ఆశించిన స్ధాయిలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కాస్త తెర‌మ‌రుగ‌య్యింది. ఇప్పుడు క్రికెట‌ర్ శ్రీశాంత్ హీరోగా న‌టించే సినిమాలో హీరోయిన్ గా అవ‌కాశం అందిపుచ్చుకుంది.

ఈ చిత్రాన్ని సానా యాదిరెడ్డి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. క్రికెట‌ర్ జీవితం చుట్టూ తిరిగే విభిన్న క‌థాంశంతో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. మ‌రి..హీరోయిన్ శాన్వీకి ఈ సినిమా తోనైనా ద‌శ తిరుగుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.