close
Choose your channels

'రివాల్వర్ రాజు' గా రాబోతున్న సప్తగిరి

Thursday, March 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి. కేవలం హాస్యానికే పరిమితం అవ్వకుండా నవరసాల్ని పండిచగలనని సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో నిరూపించుకున్నారు.

ఈ నేపథ్యంలో కమీడియన్ గా రాణిస్తూనే హీరోగా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సప్తగిరి. ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హాస్యనుటిగా నటిస్తూ తన మార్క్ కామెడీని పండించేందుకు రెడీ అవుతున్నాడు సప్తగిరి. అలానే యంగ్ హీరోలు శర్వానంద్, నాగఅన్వేష్ తదితరుల చిత్రాల్లో కూడా సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పాటే హీరోగా తన ద్వితయ చిత్రానికి సంబంధించిన పనుల్లో కూడా సప్తగిరి బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి “రివాల్వర్ రాజు” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సప్తగిరి ప్రకటించారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని విడుదల చేస్తామని సప్తగిరి తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.