close
Choose your channels

సప్తగిరి ఎక్స్ ప్రెస్ దసరా స్పెషల్ పోస్టర్

Tuesday, October 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే దసరా సందర్భంగా తెలుగు ప్రేక్షకులకి, మీడియా వారికి శుభకాంక్షలు తెలుపుతూ నిర్మాత డాక్టర్ రవికిరణ్ దసరా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు. శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌.
సప్తగిరి పై 'అభినేత్రి' టీమ్ పొగడ్తల జల్లు
ఇండియన్ మైఖల్ జాక్సన్, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్ లో తాజాగా విడుదలైన చిత్రం అభినేత్రి. హారర్ కామెడీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో సప్తగిరి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కమెడియన్ గా ప్రేక్షకుల పెదల పై నవ్వుల పువ్వులు పూయించే సప్తగిరి మరోమారు అభినేత్రి సినిమాతో ఆకట్టుకున్నారు. దీంతో సప్తగిరి నటనకి అభినేత్రి టీమ్ నుంచే కాదు ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే విడుదల కాబోతున్న తన హీరో లాంఛింగ్ మూవీ 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' తో మరింతగా ప్రేక్షకుల్ని అలరిస్తానంటూ ప్రేక్షకులకి, మీడియా వారికి కృతజ్ఞతలతో పాటు దసరా శుభకాంక్షలు తెలిపారు సప్తగిరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.