close
Choose your channels

గుజరాత్ లో గబ్బర్ సింగ్..

Thursday, November 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నేటి నుంచి గుజ‌రాత్ లో నెల రోజులు పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్, కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈరోజు ఉద‌య‌మే గుజ‌రాత్ లో షూటింగ్ లో పాల్గొన‌డం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అహ్మాదాబాద్ లో దిగారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్న స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.