close
Choose your channels

'శరభ' టీజర్ విడుదల

Monday, September 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకాష్‌ కుమార్‌, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శరభ'. యన్‌.నరసింహారావు దర్శకుడు. అశ్వనికుమార్‌ సహాదేవ్‌ నిర్మాత. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ...

దిల్‌రాజు మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ నరసింహ మా బ్యానర్‌లో కో డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో 'సార్‌ నా దగ్గర మంచి కథ వుంది వినండి' అన్నాడు. అప్పుడు నేను తనతో మంచి రివెల్యూషనరీ సబ్జెక్ట్‌ ఉంటే చెప్పు అని అన్నాను. అయితే సరేనని అన్నాడు. ఓ రోజు ఫోన్‌ చేసి ఇలా శరభ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నానని చెప్పగానే, 'నీకేమైనా పిచ్చా, నేనేం అడిగాను, నువ్వేం చేస్తున్నావ్‌' అని అన్నాను. అయితే రీసెంట్‌గా నాకు శరభ టీజర్‌ చూపించాడు. నేను థ్రిల్‌ అయ్యాను. టీజర్‌లో మ్యాజిక్‌ ఉంది. సినిమా అంతా ఇదే మ్యాజిక్‌ ఉంటే సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది' అన్నాను. ఇలాంటి గ్రాఫిక్స్‌ ఉన్న సినిమాకు డబ్బున్న నిర్మాతలే కాదు, మంచి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు కూడా అవసరం. ఆకాష్‌, సురేష్‌గారు మంచి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు. అమ్మోరు, దేవి చిత్రాలు కూడా ప్రేక్షకులు ముందుకు రావాలంటే చాలా సమయం పట్టింది. అలాగే ఈసినిమాకు కూడా సమయం పట్టింది. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అయ్యి నరసింహ, అతని టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి మాట్లాడుతూ - ''ఈ సినిమాకు రోషన్‌ సాలూరి సంగీతం అందించాడు. నేను అతనికి సహాయంగా ఉన్నానంతే. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను కోరుతుంది. కథకు తగ్గట్టే మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కుదిరింది. తప్పకుండా సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు ఎన్‌.నరసింహారావు మాట్లాడుతూ - ''ఇరవై సంవత్సరాలు పలు చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత దర్శకుడిగా నా తొలి సినిమా శరభ. ఈ కథను రెండేళ్లు ఓ హీరోతో చేయాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ఇంకా కొంత మంది నిర్మాతలను కలిశాను. కథ బావుందని అన్నా, బడ్జెట్‌ విషయంలో వెనకడుగువేశారు. ఆ సమయంలో ఆకాష్‌ తండ్రిగారిని కలిశాను. ఆయన కథ విన్నారు. ముందు కొన్ని చేంజస్‌ చెప్పారు కానీ నేను వినలేదు. రెండు రోజుల తర్వాత ఆయన తన కొడుకుతో ఈ సినిమా చేయమని అన్నారు. ముందు నేను చేయనని అన్నారు. చివరకు ఆకాష్‌తో ఓ నాలుగురోజులు స్పెండ్‌ చేశాను. ఆ సమయంలో తన గురించి తెలిసింది. నా కోసం మీ ఫ్యూచర్‌ పాడవుతుందనుకుంటే నేను ఒప్పుకోను సార్‌ అని తన అన్నమాట నాకు నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. తను గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన అబ్బాయి. ఈ సినిమా కోసం తనను చాలా ఇబ్బంది పెట్టాను. ఆరునెలలు పాటు లాంగ్వేజస్‌ నేర్పించాను. ఎనిమిది నెలలు పాటు వర్కవుట్స్‌ చేశాడు. ఇలా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా కోసం ముప్పై కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతే కాదు, ఆయన కొడుకు భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టిన నిర్మాత ఈ సినిమాతో దొరకడం నా అదృష్టం. మంచి టీంను అందించారు. కోటిగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాతో మిస్తీకి మంచి బ్రేక్‌ వస్తుంది'' అన్నారు.

హీరో ఆకాష్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా కోసం మూడున్నరేళ్లుగా ట్రావెల్‌ చేస్తున్నాం. ఒక గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. జయప్రద, తనికెళ్ళభరణి, నాజర్‌ ఇలా గొప్ప గొప్ప సీనియర్స్‌తో పనిచేసే అవకాశం కలిగింది. శరభ కథను నేను ఎంచుకోలేదు. ఆ శరభ కథే హీరోగా నన్ను సెలక్ట్‌ చేసుకుందని ఈ జర్నీలో నేను తెలుసుకన్నాను. నేను ఈ క్యారెక్టర్‌ చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నరసింహారావుగారికి థాంక్స్‌. సోషియో ఫాంటసీ చిత్రమిది'' అన్నారు.

భీమినేని మాట్లాడుతూ - ''నరసింహారావు అప్రెంటీస్‌గా నా దగ్గరే దాదాపు ఏడేళ్ల వరకు పనిచేశాడు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని మనస్తత్వం. టీజర్‌ చూస్తుంటే మంచి ఎమోషన్స్‌ కనపడుతున్నాయి. భవిష్యత్‌లో నరసింహారావు పెద్ద దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ - ''అరుంధతి తర్వాత ఆ రేంజ్‌లో వుండే మూవీగా శరభ అందరికీ నచ్చుతుంది. నిర్మాతగారు ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత పెద్ద బడ్జెట్‌లో సినిమా చేయడం గొప్ప విషయం. హీరో సహా ఎంటైర్‌ యూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ - ''ఇంత మంచి కథకు మాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ నరసింహారావుగారికి పెద్ద విజన్‌ ఉంది. నాకు చెప్పిన కథ కంటే పదింతలు గొప్పగా స్క్రీన్‌పై చూపించారు దర్శకులు. నిర్మాతగారు ఓ కొత్త దర్శకుడిని నమ్మి, ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా చూస్తే దర్శక నిర్మాతల ప్యాషన్‌ అర్థమవుతుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ మిస్తీ, గొరేటి వెంకన్న, చరణ్‌దీప్‌, రమణసాల్వ, ఎల్‌.బి.శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

ఆకాష్‌ కుమార్‌, మిస్టి చక్రవర్తి, డా.జయప్రద, నెపోలియన్‌, నాజర్‌, పునీత్‌ ఇస్సార్‌, తనికెళ్ళ భరణి, ఎల్‌.బి.శ్రీరాం, పొన్‌వన్నన్‌, షాయాజీ షిండే, పృథ్వీ, చరణ్‌దీప్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌: కోటి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: రమణ సాల్వ, ఆడియోగ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ.ఎస్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: వేదవ్యాస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరాం, నిర్మాత: అశ్వని కుమార్‌ సహదేవ్‌, రచన, దర్శకత్వం: యన్‌.నరసింహారావు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.