close
Choose your channels

వెంకీ టైటిల్ తో శర్వానంద్

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, అక్ష‌ కథానాయికలుగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్నిరూపొందుతున్న సంగతి తెలిసిందే.
భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'డార్లింగ్‌' చిత్రానికి కరుణాకరన్‌ వద్ద అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేసుగుర్రం, కిక్‌2, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించిన ర‌వికిష‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు `రాధా` అనే టైటిల్ ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలోశ‌ర్వానంద్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇదే టైటిల్‌తో వెంక‌టేష్‌, మారుతి సినిమా విడుద‌ల కావాల్సింది..కానీ ఆగిపోయింది. ఇప్పుడ‌దే టైటిల్‌తో శర్వానంద్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.