close
Choose your channels

వరంగల్ లో ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ గ్రాండ్ లాంచ్

Monday, May 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైన్నైలో పేరు గాంచిన ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న…. సినిమాల్ని అమితంగా ప్రేమించే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న వరంగల్ పట్టణంలో తమ ఎస్ 2 సినిమాస్ మల్టిప్లెక్స్ స్కీన్స్ ప్రారంభించింది. ఇందులో మొత్తం 5 స్క్రీన్స్ ఉంటాయి. టోటల్ సీటింగ్ కెపాసిటీ 976. నాలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సంస్థకు 43 స్క్రీన్స్ ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎస్ పి ఐ సినిమాస్ ప్రెసిడెంట్ స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ…. వరంగల్ పట్టణంలో ఎస్ 2 సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ప్రారంభిస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ పట్టణ ప్రజలు సినిమాల్ని ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రెక్షకులు పూర్తి సంతృప్తి చెందే విధంగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఉంది. అంతే కాదు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్క్రీన్స్ కావడంతో… ప్రేక్షకులు సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎస్ పి ఐ సినిమాస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ రిచర్డ్ మ్యూసా మాట్లాడుతూ… వరంగల్ లో మా ఎస్ 2 మల్టీప్లెక్స్ ప్రారంభం కావడం చాలా సంతోషం. కస్టమర్ కేర్ ను దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ ఉన్న సినిమాల్ని వీక్షించేందుకు ఈ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ దోహదం చేస్తాయి. ఈ మాల్ లో దొరికే ఫుడ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వరంగల్ పట్టణానికే తలమానికంలా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతుందని గర్వంగా చెప్పగలం. బెస్ట్ సౌండ్, 4 కె ప్రొజెక్షన్, 3డి టెక్నాలజీ మా సొంతం. డాల్బీ అట్మాస్ సిస్టం కావడంతో స్పెషల్ ఫీల్ కలుగుతుంది. అద్భుతమైన ఇంటీరియర్, సీటింగ్…. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటాయి. ఇక్కడ దొరికే పాప్ కార్న్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. పోర్టబుల్ చార్జర్స్, వైఫై, వాట్సాప్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి.

ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఎస్ పి ఐ సినిమాకు ప్రత్యేకమైన స్థానం పేరు ఉన్నాయి. ఎగ్జిబిషన్, డిస్ట్రిబిషన్, ప్రొడక్షన్ రంగంలో నిష్ణాతులు. ఎస్ పి ఐ సినిమాస్ చైన్నై నగరంలో 1974నుంచి ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విస్తృత సేవలు అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.