close
Choose your channels

సెన్సార్ పూర్తి చేసుకున్న 'స్పైడర్'

Monday, September 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తొలి ద్విభాషా చిత్రం స్పైడ‌ర్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ చిత్రం ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్పైడ‌ర్ చిత్రానికి సంబంధించిన‌ పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయ‌ట‌. సినిమాకు యు/ఎ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. తొలిసారి మ‌హేష్‌, మురుగదాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డం, మ‌హేష్ లుక్‌, మురుగ‌దాస్ టేకింగ్ అన్నీ వెర‌సి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.