close
Choose your channels

'శ్రీమంతుడు' పాటలు విడుదల

Sunday, July 19, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమానుల కోసం ఎప్పుడూ మంచి సినిమాలే చేయాని ప్రయత్నిస్తుంటాను. లాస్ట్‌ టైమ్‌ డిసప్పాయింట్‌ చేశాను. అందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. అభిమానులు శ్రీమంతుడి పెద్ద హిట్ చేసి ఈ సారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని కోరుకుంటున్నానని సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు` ఆడియో వేడుకలో అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం 'శరీమంతుడు'. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది.

విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాసరావుకి అందించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మ, సూపర్‌స్టార్‌ మహేష్‌, నమ్రత శిరోద్కర్‌,గౌతమ్, గల్లా జయదేవ్, వి.వి.వినాయక్‌, సుధీర్‌బాబు, శృతిహాసన్, జగపతిబాబు, ఆదిశేషగిరిరావు, శ్రీకాంత్‌ అడ్డా, చిత్ర దర్శుడు కొరటా శివ, జూపల్లి అరుణ్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌, చిత్ర నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సినిమాటోగ్రాఫర్‌ మది, సుచర్‌ ఇండియా అధినేత కిరణ్‌, గోపిచంద్‌ అచంట, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

హీరోగా తెలుగు ఇండస్ట్రీలో 50 వసంతాలను పూర్తి చేసుకున్న కృష్ణకి అతిథులందరూ సన్మానం చేశారు.

ఈ సందర్భంగా...

సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ టైటిల్‌ చాలా బావుంది. టీజర్‌, ట్రైలర్స్‌ చూశాను. మహేష్‌ చాలా గ్లామర్‌గా ఉన్నాడు. మిర్చి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. అదే విధంగా మా సత్యమూర్తిగారి అబ్బాయి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అయి నిర్మాతలకు లాభాలను తీసుకు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ మాట్లాడుతూ దేవి మ్యూజిక్‌ నాకు బాగా ఇష్టం. తన ఎనర్జీని ఇష్టపడతాను. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో జాగోరే సాంగ్ నా కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అవుతుంది. డైరెక్టర్‌ శివగారి గురించి చెప్పాంటే తను ఒక ఎక్స్‌ట్రార్డినరీ రైటర్‌. ఆయన కథ ఏదైతే చెప్పాడో అంత కంటే సినిమాని బాగా తీశారు. మది ఎక్సలెంట్‌ సినిమాగ్రఫీని అందించారు. మా వెనుక నిబడి బలానిచ్చాడు. ఈ సినిమాని ఒప్పుకున్నందుకు జగపతిబాబుగారికి థాంక్స్‌. ఆయన తప్ప ఈ పాత్రని ఎవరూ చేయలేరనే విధంగా నటించారు. నేను కమల్‌హాసన్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన కూతురు శృతిహాసన్ తో పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. శృతి ఒక టెరిఫిక్‌ పెర్‌ఫార్మర్‌. ఈ సినిమాలో బాగా నటించింది. రాజేంద్రప్రసాద్‌, సుకన్య ఇలా అందరితో నటించేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో పనిచేసినట్లుగా భావించాను. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ లు తొలిసారి ప్రొడక్షన్ చేస్తున్నప్పటికీ సినిమాని చక్కగా నిర్మించారు`` అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ చిన్నడి అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే మీకు, మీ అభిమానులందరికీ దిమ్మ తిరిగిపోతుంది, కలెక్షన్స్‌ బద్ధలైపోతుందని చెబుతున్నాను. టీమ్ కి ఆల్‌ ది బెస్ట్‌`` అన్నారు.

గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ `సినిమా టీజర్ ని చాలా సార్లు చూశాను. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది`` అన్నారు.

గల్లా జయదేవ్ మాట్లాడుతూ `ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో నా కొడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. సినిమా మంచి కథతో మీ ముందుకు వస్తుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది`` అన్నారు.

డైరెక్టర్‌ కొరటా శివ మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో ముందు మహేష్ గారికే థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ యాక్టర్‌ మహేష్‌, ఆయన్ని ఇంత త్వరగా డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టం. మహేష్‌ని ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కష్టపడి రాసుకున్న కథ. కథ వినగానే ఆయన ఎమనుకుంటారో అనుకున్నాను. ఆయన ఏమాత్రం ఆలోచించచకుండా ఒప్పుకున్నారు. నిర్మాతలు చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించారు. తొలి సినిమానే చేస్తున్నప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దేవిశ్రీ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ మది, రామజోగయ్యశాస్త్రికు స్పెషల్‌ థాంక్స్‌. జగపతిబాబుగారు, మహేష్‌గారు తండ్రికొడుకులుగా సూపర్‌గా కనపడ్డారు. ముందు తండ్రిగా చేయడానికి ఇప్పుకుంటారో లేదోనని అనుకుంటే కథ వినగానే ఆయన వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. మహేష్‌, శృతి పెయిర్‌ బావుంది. కొద్దిగా కష్టపడి రాసిన కథే. ఇతర టీమ్‌ సభ్యులందరికీ థాంక్స్‌`` అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ సక్సెస్ కోసం మహేష్‌ అభిమానులు ఆవేశంగా, అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చూస్తే విదేశాల్లోని వారు, సిటీలో ఉన్నవాళ్లు మళ్లీ మన ఊరెళ్లి దాన్ని దత్తత తీసుకోవాని అనుకునేంత మంచి సబ్జెక్ట్. శివ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు. ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. దేవుడు మహేష్ అందంతో పాటు, చిలిపితనం, తుంటరితనం, చలాకీతనం అన్నింటినీ ఇచ్చాడనిపిస్తుంది. ఆంధ్రుల అందగాడు మహేష్‌ అని అందరూ అంటుంటారు. నేను కూడా అదే అంటున్నాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ మహేష్ తో వందకోట్ల సినిమా చేయాలనుంది. ఆయనకి మంచి కథ చెప్పి ఒప్పించి సినిమా చేస్తాను. కథ తయారవుతుంది. కొరటాల శివగారి డైరెక్షన్‌ చాలా ఇష్టం. మంచి డైలాగ్స్ రాస్తారు. ట్రైలర్ చాలా బావుంది. మదిగారి సినిమాటోగ్రాఫిక్‌ బావుంది. దేవిశ్రీ అదరిపోయే మ్యూజిక్‌ ఇచ్చాడు. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ సినిమా పెద్ద హిట్‌ కావాలి`` అన్నారు.

శ్రీనువైట్ల మాట్లాడుతూ `మిర్చి సినిమాని మించి శ్రీమంతుడు ఉంటుంది. డైరెక్టర్ శివ అంత మంచి కథతో సినిమాని డైరెక్ట్ చేశాడు. సినిమా టీజర్, పోస్టర్ చాలా ఫ్రెష్ లుక్ తో కనపడుతున్నాయి. దేవి మ్యూజిక్ సినిమా చాలా ప్లస్ అవుతుంది. అందరూ అభిమానుల్లాగానే నేను కూడా ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను`` అన్నారు.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ` సినిమా టీజర్ చాలా బావుంది. పాటలు కూడా బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, శృతిహాసన్‌, అలీ, సుబ్బరాజు, వెన్నె కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తుసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తుసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ ` మాటు ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: కొరటా శివ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.