close
Choose your channels

చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే - రాజమౌళి

Tuesday, June 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

1986లో జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన రెండు రెళ్ళ ఆరు సినిమా పెద్ద థియేట‌ర్స్‌లో న‌వ్వులు పువ్వులు పూయించింది. ఇప్పుడు అదే పేరుతో సినిమా రూపొందింది. డే డ్రీమ్స్ బ్యాన‌ర్‌ఫై నందు మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌దీప్ చంద్ర‌, మోహ‌న్ సినిమాను నిర్మించారు. అనిల్ మ‌ల్లెల‌, మ‌హిమా హీరో హీరోయిన్స్‌గా న‌టించారు. ఈగ‌, దిక్కులు చూడ‌కు రామ‌య్యా, జో అచ్యుతానంద సినిమాల నిర్మాత సాయి కొర్ర‌పాటి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. విజ‌య్ బుల్‌గానిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. రాజ‌మౌళి ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి సీడీని ఎం.ఎం.కీర‌వాణి అందుకున్నారు.

పెద్ద హీరోల‌కు స్టార్ వేల్యూతో ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌స్తారు. కానీ చిన్న సినిమాల‌కు ప్రేక్ష‌కులు రావాలంటే అందులో ఇంట్రెసింట్ పాయింట్‌గానీ, హార్ట్ ట‌చింగ్‌గానీ, కామెడితో నిండి ఉండాలి. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. అలాగే సాయికొర్ర‌పాటిగారికి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. క‌థ‌ను బాగా అంచ‌నా వేయ‌గ‌ల‌రు. నేను ఈగ సినిమాను చిన్న బ‌డ్జెట్లో తీద్దామంటే, అది మాస్ సినిమా అని లావిష్‌గా తీశారు. ఆయ‌నలాంటి జడ్జ్‌మెంట్ ఉన్న వ్య‌క్తి ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారంటే సినిమా త‌ప్ప‌కుండా బావుంటుందని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఎం.కీర‌వాణికి కూడా యూనిట్‌కు త‌న శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.

స్టోరీ కుదిరిన త‌ర్వాత ఏడాదిన్న‌ర పాటు సినిమాతో ట్రావెల్ చేశాం . ఈ ట్రావెల్‌లో చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఓ సినిమా చేయ‌డం ఎంత క‌ష్ట‌మో తెలిసింది. సినిమా పూర్త‌యిన త‌ర్వాత విడుద‌ల చేయ‌డానికి స‌రైన వ్య‌క్తి కోసం తిరిగాం. సాయిగారు మా సినిమాకు బ్యాక్ బోన్‌లా నిలిచారు. అంద‌రూ సినిమా కోసం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. స‌పోర్ట్ చేసిన అందరికీ ధ‌న్య‌వాదాలని నిర్మాత‌లు అన్నారు. మా దర్శ‌కుడు నందుగారు సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నేను ప‌క్క నుండి చూశాను. అలాగే నిర్మాత ప్ర‌దీప్‌గారు, సాయికొర్ర‌పాటికి థాంక్స్ అని విజ‌య్ బుల్‌గానిన్ అన్నారు.

ఒక గొప్ప క‌థ రాసుకుంటే అది అంద‌రినీ ట్రావెల్‌లో ముందుకు తీసుకెళుతుంద‌ని రెండు రెళ్ళు ఆరు సినిమా రుజువు చేసింది. మా టీం క‌న్న క‌ల‌ల‌కు నిర్మాత‌లు ప్ర‌దీప్‌, మోహ‌న్‌గారు రూప‌మిస్తే, సాయికొర్ర‌పాటిగారు దానికి ప్రాణం పోశారు. అందుకు సాయిగారికి థాంక్స్‌. నేను ఈరోజు ఈ స్టేజ్‌పై నిల‌బ‌డ్డానికి కార‌ణం నా టీం మాత్ర‌మే. హీరో అనిల్, రైట‌ర్‌గా కూడా ఎంతో స‌పోర్ట్ చేశాడు. అలాగే రైటింగ్ డిపార్ట్‌మెంట్‌, డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్ సహా అంద‌రికీ థాంక్స్‌. విజ‌య్ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు అని ద‌ర్శ‌కుడు నందు మెల్లెల యూనిట్ థాంక్స్ చెప్పారు.

డా.వి.న‌రేష్‌, ర‌వి కాలే, ల‌క్ష్మీ వాసుదేవ‌న్‌, ప్ర‌మోదిని, ర‌మేష్‌, రాఘ‌వ‌,మ‌నోహ‌ర్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః సుమిత్ కె.ప‌టేల్‌, డైలాగ్స్ః రాజ‌శేఖ‌ర్ సంబార్‌, నారా ప్ర‌వీణ్‌, సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట అమ‌ర‌నాథ రెడ్డి, ఎడిట‌ర్ః జాన‌కిరాం, మ్యూజిక్ః విజ‌య్ బుల్‌గానిన్‌, నిర్మాత‌లుః ప్ర‌దీప్ చంద్ర‌, మోహ‌న్ అండె, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః నందు మ‌ల్లెల‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.