close
Choose your channels

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ హీరో...

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ హీరో..ఎవ‌ర‌నుకుంటున్నారా..? యువ క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. సూప‌ర్ స్టార్ కృష్ణ చిన్న అల్లుడు అయిన సుధీర్ బాబు బాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసే స్ధాయికి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇండ‌స్ట్రీలో అన్నిర‌కాలుగా స‌పోర్ట్ ఉన్నా...సుధీర్ బాబు ఫ‌స్ట్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌లేదు. చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైత‌న్య న‌టించిన ఏమాయ చేసావే చిత్రం ద్వారా సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. ఏమాయ చేసావే చిత్రంలో సుధీర్ బాబు న‌టించ‌డం ఏమిటి..? అనుకుంటున్నారా..? ఈ చిత్రంలో జెస్సీ (స‌మంత‌) బ్ర‌ద‌ర్ గా న‌టించింది ఎవ‌రో కాదు సుధీర్ బాబే.
ఏమాయ చేసావే చిత్రంలో చిన్నపాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు...ఆత‌ర్వాత ఎస్.ఎం.ఎస్ (శివ మ‌న‌సులో శృతి) చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాతో సుధీర్ బాబు బాగా న‌టిస్తాడు..బాగా డ్యాన్స్ చేస్తాడు అని పేరు సంపాదించుకున్నాడు. కానీ..అత‌ని వాయిస్ లో బేస్ లేదు బేస్ ఉంటే బాగుండేది అన్నారు. సినీ పండితుల‌ విమ‌ర్శ‌ను స్వీక‌రించాడు. త‌నిని తాను మార్చుకున్నాడు. దీని కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టానికి త‌గ్గ ఫలితమే ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ స‌క్సెస్. ఈ సినిమాలో సుధీర్ బాబు వాయిస్ గ‌మ‌నిస్తే గ‌త చిత్రానికి ఈ చిత్రానికి అత‌ని వాయిస్ లో ఎంత ఛేంజ్ వ‌చ్చిందో క్లియ‌ర్ గా తెలుస్తుంది. ప్రేమ‌క‌ధా చిత్ర‌మ్ తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌ర్వాత సుధీర్ బాబు ఆడు మ‌గాడ్రాబుజ్జి, మాయ‌దారి మ‌ల్లిగాడు, మోస‌గాళ్ల‌కు మోస‌గాడు చిత్రాల్లో న‌టించినా ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు చూడాల‌నుకుంట‌న్నారో ఆలోచించి విభిన్న‌మైన క‌థాంశంతో భ‌లే మంచిరోజు సినిమా చేసాడు మంచి విజ‌యాన్ని సాధించాడు. చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి...ఆత‌ర్వాత హీరోగా మారి విజ‌యం సాధించిన ఈ టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో టైగ‌ర్ ష్రాఫ్, శ్ర‌ద్దా క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం భాగీ. ఈ చిత్రంలో సుధీర్ బాబు రాఘ‌వ్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు పాత్ర గురించి తెలియ‌చేసేలా ఓ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఇందులో సుధీర్ బాబు బాడీ, యాక్టింగ్..బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింద‌ట‌. ఈ టాలీవుడ్ హీరో బాలీవుడ్ యాక్ష‌న్ హీరోలా..స్టైలీష్ యాక్ష‌న్ తో అద‌ర‌గొట్టేసాడు అంటున్నారు. యూటివి మోహ‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై సాజిద్ న‌డియ‌డ్ వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ష‌బ్బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని ఈనెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.
విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించి...త‌న‌ని తాను మార్చుకుని...ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు అని నిరూపించి...ఎంద‌రికో స్పూర్తిగా నిలుస్తూ..బాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హ్యాట్సాఫ్ & ఆల్ ది బెస్ట్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.