close
Choose your channels

సునీల్ న్యూమూవీ టైటిల్...

Friday, March 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఆర్. సుద‌ర్శ‌న‌రెడ్డి నిర్మిస్తున్నారు.ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి టైటిల్ జ‌క్క‌న్న అని ప్ర‌క‌టించారు.
ఈ సంద‌ర్భంగా....
ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో హీరో సునీల్ మాట్లాడుతూ...ఈ మూవీకి జ‌క్క‌న్నటైటిల్ బ్యాక్ టు ఎంట‌ర్ టైన్ అనేది క్యాప్ష‌న్. మ‌ర్యాదరామ‌న్న త‌ర్వాత ఈ సినిమాకి కెమెరామెన్ రాంప్ర‌సాద్ తో వ‌ర్క్ చేసాను. డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ఆకెళ్ల ర‌క్ష సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమాని రామ్ గోపాల్ వ‌ర్మ హిందీలో తెర‌కెక్కించారు. నాకంటే ర‌క్ష సినిమాని వంశీకృష్ణ బాగా తీసాడ‌ని రాము గారు చెప్పారు. ఈ సినిమాని వంశీ అంద‌రికీ న‌చ్చేలా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు వ‌ర‌కు రాని కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. ఇక ఈ సినిమాకి జ‌క్క‌న్న అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటంటే..ఎందుకు ప‌నికిరాని రాయిని శిల్పంగా అద్భుతంగా చెక్కారు అమ‌ర‌శిల్పి జ‌క్క‌న్న‌. అలాగే ఈ సినిమాలో ఎందుకు ప‌నికిరాని వ్య‌క్తిని మారుస్తాడు. అందుచేత క‌థ‌క‌నుగుణంగానే ఈ టైటిల్ పెట్టాం అన్నారు.
నిర్మాత సుద‌ర్శ‌న‌రెడ్డి మాట్లాడుతూ...ఇది యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ నెల 24 నుంచి లాస్ట్ షెడ్యూల్ చేయ‌నున్నాం. ఏప్రిల్ లో పాట‌లను చిత్రీక‌రించ‌నున్నాం. మే నెలాఖ‌రున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
డైరెక్ట‌ర్ వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ...కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సునీల్ క‌థ విని నాకు బాగా న‌చ్చింది ఈ సినిమా నేను చేస్తాను అని చెప్పి నాకు చాలా ఎన‌ర్జి ఇచ్చారు. ఎన‌భైశాతం షూటింగ్ పూర్త‌య్యింది. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కెమెరామెన్ రాంప్ర‌సాద్, ర‌చ‌యిత‌లు మ‌హ‌ర్షి, భ‌వానీ ప్ర‌సాద్, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.