close
Choose your channels

'మెట్రో' గీతామాధురి సాంగ్ ని లాంచ్ చేసిన సునీల్

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు.
ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ - ``మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అంద‌రూ ఆద‌రించాలి. చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ``గీతామాధురి త‌నే స్వ‌యంగా పాడి, త‌నే న‌టించిన పాట‌ను హీరో సునీల్ ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లు తెర‌వెన‌క గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై త‌ను క‌నిపించ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం`` అని తెలిపారు.

నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ- ``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మార్చి 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.