close
Choose your channels

సన్నిలియోన్ తెలుగులో నటిస్తుంది...

Sunday, October 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోర్న్ స్టార్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌న్నిలియోన్ గురించి తెలియ‌ని వారుండ‌రంటే విచిత్ర‌మే. స‌న్నిలియోన్ బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులో కూడా క‌రెంట్ తీగ చిత్రంలో ఐటెమ్‌సాంగ్‌లో న‌టించింది. త‌ర్వాత ఏ ద‌క్షిణాది సినిమాలో పాట‌ల్లో కానీ సీన్స్‌లో కానీ క‌నిపించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే తెలుగులో ఓ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఆర్‌.కె.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్.ఎం నిర్మాత‌గా రూపొందిన గుంటూరు టాకీస్ సినిమా మంచి ఆద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది. గుంటూరు టాకీస్-2 పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ అక్టోబ‌ర్ 11 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో స‌న్నిలియోన్ ఓ డాన్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నుంది. 20 రోజ‌లు పాటు స‌న్నిలియోన్ పాత్ర చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ట‌. ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన కిర‌ణ్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రానికి నిర్మాత రాజ్‌కుమార్‌.ఎం మెగాఫోన్ చేప‌ట్ట‌నున్నాడట‌. సినిమాను గుంటూరు టాకీస్ విడుద‌లైన మార్చి నెల‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.