close
Choose your channels

రీమేక్ లో సన్నిలియోన్...

Tuesday, July 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2005లో శేఖ‌ర్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎ ఫిల్మ్ బై అర‌వింద్‌` సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. రాజీవ్ క‌న‌కాల‌, షెర్లిన్ చోప్రా, రిషి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన ఈ చిత్రం సెన్నేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.
అందులో భాగంగా న‌టీన‌టులు ఎవ‌రెవ‌రైతే బావుటుంద‌నే దానిపై ఆలోచించాడ‌ట‌. షెర్లిన్ చోప్రా పాత్ర‌కు స‌న్నిలియోన్ అయితే సూట్ అవుతుంద‌ని శేఖ‌ర్ సూరి అనుకున్నాడు. ఆమెను సంప్ర‌దించాడ‌ట‌. కాక‌పోతే స‌న్నిలియోన్ వైపు నుండి ఎటువంటి స‌మాధానం ఇంకా రాలేదు. ఆమె ఓకే అంటే సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.