close
Choose your channels

రాజశేఖర్ సినిమాలో సన్ని స్పెషల్ సాంగ్...

Monday, March 6, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీస్‌, సి.బి.ఐ పాత్ర‌ల‌కు హీరో డా.రాజ‌శేఖ‌ర్ పెట్టింది పేరు. అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు స‌హా ప‌లు పోలీసు క్యారెక్ట‌ర్స్‌లో రాజ‌శేఖ‌ర్ మెప్పించారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా గ‌రుడు వేగ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజ‌శేఖ‌ర్ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గానే క‌న‌ప‌డ‌బోతున్నాడు.

ఓ ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ జీవితంలో అనుకోకుండా స‌మ‌స్య‌లు ఎదురైతే వాటి నుండి త‌నెలా భ‌య‌ప‌డ్డాడు, ప్ర‌జ‌ల‌నే ర‌క్షించాడ‌నేదే క‌థాంశంగా రూపొందుతోన్న ఈ చిత్రం మాజీ పోర్న్ స్టార్‌, ప్ర‌స్తుత బాలీవుడ్ స్టార్ స‌న్నిలియోన్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికార‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. గ‌తంలో తెలుగులో క‌రెంటు తీగ సినిమాలో న‌టించిన స‌న్నిలియోన్‌, ఇప్పుడు గుంటూరు టాకీస్-2లో న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.