close
Choose your channels

ఈనెల 9న 'మేము' మ్యూజిక్‌ ఫంక్షన్‌

Friday, November 6, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న మేము` చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సన్నితి ప్రొడక్షన్స్‌ అధినేత ప్రసాద్‌ సన్నితి- శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్‌ అధినేత తమటం కుమార్‌రెడ్డి ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు. పిశాచి` ఫేం అర్రోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వెన్నెలకంటి-సాహితి-చంద్రబోస్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. హైద్రాబాద్‌, హైటెక్‌ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికపై జరగనున్న ఈ ఆడియో వేడుకలో సూపర్‌స్టార్‌ సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి, చిత్ర దర్శకుడు పాండిరాజ్‌, సంగీత దర్శకుడు అర్రోల్‌ కొరెల్లి తదితర చిత్ర బృందంతోపాటు.. మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అతిరధమహారధులు అతిధులగా పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్య సినిమాకు తెలుగులో గల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. మేము` ఆడియో ఫంక్షన్‌ను

శిల్పకళా వేదికపై అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మేము` చిత్ర బృందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు` అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య`కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.