close
Choose your channels

తాప్పీ క్షమాపణ

Saturday, July 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శతాధిక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎంతో మంది కొత్త హీరోయిన్స్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వారిలో తాప్సీ కూడా ఒకటి. ఇటీవల తాప్సీ బాలీవుడ్‌కు చెందిన ఓ కామెడి షోలో పాల్గొంది. ఆ షోలో తాప్సీ రాఘవేంద్రరావుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఝుమ్మందినాదం చిత్రంలో త‌నపై రాఘ‌వేంద్ర‌రావు కొబ్బ‌రి బొండాలు విసిరారు. అందులో ఆయ‌న‌కు క‌న‌ప‌డ్డ అందం ఏంటోన‌ని అంది.
షో అంతా రాఘ‌వేంద్ర‌రావుని చూసి న‌వ్వారు. అయితే తాప్సీ చేసిన కామెంట్స్ చాలా మంది సామాజిక మాధ్యమాల్లో తప్పు పట్టారు. దీనిపై స్పందించిన తాప్సీ రాఘవేంద్రరావుకు క్షమాపణ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తన స్థాయి కారణం రాఘవేంద్రరావు అని చెప్పింది. త‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన వారిని విమ‌ర్శించ‌ను. అలాంటిది రాఘ‌వేంద్ర‌రావుగారికి తాను అవమానపరిచానని ఆరోపణ రావడం వింతగా ఉందని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలు తన గురించేనంది. కేవలం తన గురించి తాను హాస్యాస్పందంగా మాట్లాడానని, ఆ క్రమంలో ఏవరినైనా బాధించే ఉంటే క్షమించాలని కోరింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.