close
Choose your channels
'కాటమరాయుడు' కి తమిళ తంబీల సపోర్ట్....
Monday, March 20, 2017 • తెలుగు Comments

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు ఈ మార్చి 24న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్‌పార్థ‌సాని డైరెక్ట‌ర్‌. రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క‌నున్న త‌మిళ‌నాడులో కూడా విడుద‌లైంది.

మ‌రో విష‌య‌మేమంటే..కాట‌మ‌రాయుడు సినిమా అజిత్ హీరోగా న‌టించిన వీరంకు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా త‌మిళ‌నాడు విడుద‌లైతే తెలుగు ప్రేక్ష‌కులు, ప‌వ‌న్ అభిమానులు త‌మిళ‌నాడులో సినిమా చూడటం కామ‌న్ విష‌యం అయినా..సేలం జిల్లాలో అజిత్ ఫ్యాన్స్ కాట‌మ‌రాయుడు సినిమా రైట్స్‌ను కొని విడుద‌ల చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు హీరో సినిమా రైట్స్‌ను త‌మిళ స్టార్ హీరో అభిమానులు కొన‌లేద‌ట‌. ఏదేమైనా తెలుగు హీరో అయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడుకి త‌మిళ తంబీల స‌పోర్ట్ దొరికిన‌ట్టే.