close
Choose your channels

'తను నేను' మూవీ రివ్యూ

Friday, November 27, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా చిత్రాలు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌న నిర్మించిన పి.రామ్మోహ‌న్ అష్టాచ‌మ్మాతో నాని, ఉయ్యాలా జంపాలాతో రాజ్ త‌రుణ్‌ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. అయితే అదే ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుండి వ‌చ్చిన మ‌రో చిత్ర‌మే త‌ను నేను. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రానికి నిర్మాత‌గానే కాకుండా రామ్మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం బాధ్య‌త‌ల‌ను చేపట్టాడు. అంతే కాకుండా ఈ చిత్రంతో సంతోష్‌శోభ‌న్ అనే మ‌రో నూత‌న హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాడ‌న‌డంతో అంద‌రిలో ఓ క్యూరియాసిటీ ఏర్ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ చిత్రాల‌ను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత‌గా పేరున్న రామ్మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వ చేస్తే ఎలాంటి ఫీల్ గుడ్ మూవీని అందిస్తాడోన‌ని అంద‌రూ అనుకున్నారు. సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. మ‌రి తను నేను ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు స‌మీక్ష‌లోకి వెళ‌దాం...

క‌థ‌

కిర‌ణ్‌(సంతోష్ శోభ‌న్‌) త‌న మిత్రుల‌తో పార్టీ చేసుకుంటుండ‌గా కీర్తి(అవికాగోర్‌), కిరణ్‌ను కొట్టి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది.అక్క‌డ నుండి సినిమా మొద‌ల‌వుతుంంది. కిర‌ణ్ త‌న క‌థ‌ను చెప్ప‌డం స్టార్ట్ చేస్తాడు. నాన్న‌మ్మ ద‌గ్గ‌ర హైద‌రాబాద్‌లోనే పెరిగిన కిర‌ణ్ ఓ బిపిఓలో ప‌నిచేస్తుంటాడు. త‌న‌కు అమెరికా అంటే కోపం. ఎవ‌రైనా అమెరికా వెళుతున్నానంటే చాలు వారిని డిస్క‌రేజ్ చేస్తుంటాడు. తిట్టిపోస్తుంటాడు. త‌న‌కి క్లోజ్ ఫ్రెండ్ అయిన న‌రేష్‌(అభిషేక్‌) కార‌ణంగా కీర్తిని క‌లుసుకుంటాడు. వారిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. కీర్తికి అమెరికా వెళ్ళాల‌నే ఆశయం ఉంటుంది. అంతే కాకుండా కీర్తి అమెరికా వెళ్ళాల‌ని ఆమె తండ్రి బండ్రెడ్డి స‌ర్వేశ్వ‌ర‌రావు(ర‌విబాబు) కోరిక‌. కానీ త‌మ ప్రేమ విష‌యం చెప్ప‌డానికి వెళ్లిన కిర‌ణ్‌కు, సర్వేశ్వ‌ర‌రావు ఒకరి ఆలోచ‌న‌లు చాలా దూరంగా ఉండ‌టంతో త‌న కూతురిని కిర‌ణ్‌కిచ్చి పెళ్ళి చేయ‌కూడద‌నుకుంటాడు స‌ర్వేశ్వ‌ర‌రావు. కిరణ్ ప్రేమ కోసం అమెరికా వెళ్ళాల‌నే ఆలోచ‌న‌ను కీర్తి మానుకుంటుంది. అలాంటి త‌రుణంలో కీర్తికి ఓ నిజం తెలుస్తుంది? ఆ నిజం ఏమిటి? అస‌లు కిర‌ణ్‌కు అమెరికా అంటే ఎందుకు కోపం? కీర్తి కిర‌ణ్‌కు ఎందుకు వార్నింగ్ ఇస్తుంది? సర్వేశ్వ‌ర‌రావు కిరణ్‌, కీర్తిల పెళ్ళికి ఒప్పుకుంటాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్‌పాయింట్స్‌

టోట‌ల్‌గా చూస్తే రామ్మోహ‌న్ డైరెక్ష‌న్ బావుంది. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను ఓవ‌ర్ హైప్ లో కాకుండా సింపుల్‌గానే డిజైన్ చేసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడు కూల్ మైండ్ సెట్‌లో ఉండేలా సినిమా క‌థ‌ను ముందుకు న‌డిపాడు దర్శ‌కుడు. కామెడి విర‌గ‌బడేంంత లేదు కానీ కామెడి సీన్స్ చూస్తున్నంత సేపు ఒక స్మైల్ వ‌స్తుంది. స‌న్నీ ఎం.ఆర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ బావున్నాయి కానీ అట్రాక్టివ్‌గా అనిపించ‌లేదు. సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫీ క్లీన్‌గా ఉంది. సంతోష్ శోభ‌న్ తొలి సినిమా అయినా చ‌క్క‌గా నటించాడు. ముఖ్యంగా శోభ‌న్ గొంతు చాలా పెక్యుల‌ర్‌గా ఉంది. చాలా ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. అవికా త‌న పాత్ర‌ను సింపుల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. బండ్రెడ్డి స‌ర్వేశ్వ‌ర‌రావు పాత్ర‌ను ర‌విబాబు ఈజీగా చేసేశాడు. అలాగే హీరోయిన్ మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ చేసిన స‌త్య‌కృష్ణ క్యారెక్ట‌ర్ కూడా కామెడినీ పండిచండంలో తోడ్ప‌డింది. ర‌విబాబు, స‌త్య‌కృష్ణ‌ల మ‌ధ్య వ‌చ్చే డిస్క‌ష‌న్ సీన్స్ బావున్నాయి.మిగిలిన పాత్ర‌ల‌న్నీ వాటి ప‌రిధి మేర న్యాయం చేశాయి. సినిమా నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌

ద‌ర్శ‌కుడు రామ్మోహ‌న్ సినిమాను రెండు గంట‌లు న‌డిపించాల‌నే ఉద్దేశంతో కొన్ని సీన్స్ యాడ్ చేశాడ‌నే విధంగా ఉంటాయి. సినిమా నేరేష‌న్ చాలా స్లోగా ఉంది. హీరో త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు దూరంగా ఉంటాడు? అస‌లు అమెరికాపై కోపం ఎందుకు పెంచుకుంటాడ‌నే దానిపై తీసిన సీన్స్ క‌న్విసింగ్‌గా అనిపించ‌వు. సాంగ్స్ అట్రాక్టివ్‌గా ఉండుంటే సినిమాకు మరింత బ‌లం చేకూరి ఉండేది. సంతోష్ శోభ‌న్ యాక్టింగ్‌ కొన్ని చోట్ల నాని, ఎక్కువ‌చోట్ల అవ‌స‌రాల శ్రీనివాస్‌ను, అక్క‌డక్క‌డా మ‌హేష్‌ను ఇమిటేట్ చేశాడా అనేలా ఉంది. అలా కాకుండా హీరో పాత్ర‌కు ఓ స్ట‌యిల్ క్రియేట్ చేసుంటే ఇంకా బావుణ్ణు క‌దా అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌

మీరు చాలా బిజీగా ఉంటారు క‌దా, మీ కోడ‌ల్ని చూసుకుంటార‌ని నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను అని హీరోయిన్ అవికా హీరో త‌ల్లిదండ్రుల‌తో చెప్పే సీన్‌, ఆ స‌న్నివేశం, నీకెవ‌రూ లేరా అని హీరో అంటే నువ్వున్నావ్‌గా అనే సీన్‌, బాల‌కృష్ణ ఫ్యాన్‌ను చిరరంజీవి అని పిలిస్తే కోపం రాదా అనే కామెడి సీన్ వంటివి ప్రేక్ష‌కుడిని బాగా ఆక‌ట్టుకుంటాయి. సినిమాను రెండు గంట‌లు బ‌దులు వ‌న్ అండ్ హాఫ్ అవ‌ర్ న‌డిపి సినిమా ఫాస్ట్‌గా ఉండేది. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ బావున్న‌ప్ప‌టికీ సినిమాలోని స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కుడు ఎమోష‌న‌ల్‌గా అటాచ్ కాలేడు. ఎక్క‌డో ఏదో మిస్స‌యిన భావ‌న క‌న‌ప‌డుతుంది. ఆ ఎమోష‌న‌ల్ పాయింట్‌ను క్యాచ్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు ఫెయిల‌య్యాడు. అలాగని తీసిపారేయ‌లేం. సినిమాను చాలా చ‌క్క‌గా ముందుకు తీసుకెళ్ళ‌డంతో హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ అయ్యాడు. . ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది హీరో సంతోష్ శోభ‌న్ గురించే మంచి ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా చేసుకుంటూ వెళ్లాడు.

బాట‌మ్ లైన్‌

ఎలాంటి వ‌ల్గారిటీ లేకుండా ఉన్నంత‌లో లాజిక్‌ల‌ను ఆశించ‌కుండా కామెడిని ఎంజాయ్ చేయాల‌నుకునే ఆడియెన్స్‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మొత్తం మీద త‌ను నేను`..ఓ కూల్ ఫ్యామిలీ ఎంటట‌ర్ టైన‌ర్‌.

రేటింగ్: 3/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.