close
Choose your channels

తరుణ్ హీరోయిన్ కి తమిళ క్రేజ్...

Wednesday, July 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో త‌రుణ్ ఇట్స్ మై ల‌వ్‌స్టోరీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెల‌సిందే. ఈ చిత్రంలో ఓవియా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈమె ప్ర‌స్తుతం క‌మ‌ల్ వ్యాఖ్యాత‌గా చేస్తోన్న త‌మిళ వెర్ష‌న్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్‌గా చేస్తుంది. ఈ షోలో ఓవియా ప్ర‌వ‌ర్త‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంద‌ట‌. హీరో శింబు కూడా ఓవియాకే మ‌ద్ధ‌తు తెలుపుతున్నాడంటే ఆమెకు ఎంత పేరుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ క్రేజ్‌తో ఓవియాకు త‌మిళ సినీ రంగం నుండి వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ` మెట్రో` ఫేమ్‌ శిరీష్‌ తన తాజా చిత్రంలో ఓవియకు కథానాయకి అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాగా తాజాగా యామిరుక్క భయమే చిత్ర పార్టు–2లోనూ ఓవియను ఎంపిక చేసుకున్నారు అదే విధంగా విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశాన్ని ఓవియ కొట్టేసింది. చూస్తుంటే ఓవియా షో నుంచి బయటకు రాగానే మరి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు త‌మిళ సినీ వ‌ర్గాలు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.