close
Choose your channels

ఉగాది సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ 'బహ్మోత్సవం' ఫస్ట్ లుక్

Thursday, April 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్ టైన్ మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. జనవరి 1న రిలీజ్‌ అయిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి ఎక్స్‌లెంట్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఏప్రిల్‌ 24న ఈ చిత్రం ఆడియోను తిరుపతిలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.