close
Choose your channels

'ఉంగరాల రాంబాబు' షూటింగ్ పూర్తి

Saturday, March 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవలే 'జ‌క్క‌న్న' తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుకగా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని న‌వ్వించ‌డానికే విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.
ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేసి, త్వ‌ర‌లో ఆడియో ని విడుద‌ల చేస్తారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్వించారు. కొన్ని పాత్ర‌ల‌కి కొంత మంది ఆర్టిస్టుల‌నే తీసుకోవాలి ఎందుకంటే వారికి మాత్ర‌మే అవి సూట‌వ్వుతాయి. అలా తీసుకున్న ముఖ్య‌మైన పాత్ర‌లే ప్ర‌కాష్ రాజ్ గారు, రావుర‌మేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీరి పాత్ర‌లు మ‌న‌సుని హ‌త్తుకుంటాయి. అతిత్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు.
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.