close
Choose your channels

'వాసుకి' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానెల్

Wednesday, July 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్‌ హీరోయిన్ న‌య‌న‌తార న‌టించిన చిత్రం `వాసుకి`. మ‌ల‌యాళంలో సూప‌ర్‌హిట్ అయిన `పుదియ నియ‌మం` సినిమాను తెలుగులో `వాసుకి` పేరుతో శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌య‌న‌తార న‌ట‌న‌కు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్త‌మ‌న‌టి అవార్డును న‌య‌న‌తార సొంతం చేసుకుంది కూడా.

ప్ర‌స్తుతం స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఓ స్త్రీ క‌థాంశంతో వాసుకి సినిమా రూపొందింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మంచి కాన్సెప్ట్‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ సినిమా తెలుగు శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు ఫ్యాన్సీ ఆప‌ర్‌తో సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా శ్రీరామ్ సినిమా బ్యాన‌ర్ అధినేత శ్రీరామ్ జీటీవీ యాజ‌మాన్యానికి ధ‌న్య‌వాదాల‌ను తెలిపారు.

చిన్న సినిమాల‌కు శాటిలైట్ కావ‌డం లేదంటూ వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో `వాసుకి` సినిమా శాటిలైట్ హ‌క్కులు అమ్ముడు కావ‌డంతో కంటెంట్ ఉన్న సినిమాకు శాటిలైట్ ఆద‌ర‌ణ ఉంటుంద‌ని నిరూప‌ణ అయ్యింది. బిజినెస్ ప‌రంగా సినిమాకు మంచి క్రేజ్ నెల‌కొంది. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.