close
Choose your channels

డిసెంబర్ 4న వస్తున్న 'వీడికి దూకుడెక్కువ'

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీకాంత్‌-కామ్నా జేత్మలిని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్‌ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో.. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం వీడికి దూకుడెక్కువ`. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం డిసెంబర్‌ 4 విడుదలకు సన్నాహాలు చేసుకొంటోంది.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మా హీరో శ్రీకాంత్‌ కెరీర్‌లో గర్వంగా చెప్పుకొనే చిత్రాల్లో ఒకటిగా వీడికి దూకుడెక్కువ` నిలుస్తుందనే నమ్మకం మాకుంది. చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పాటలతోపాటు, ఫైట్స్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడి వంటి అంశాలన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని ఆశిస్తున్నాం. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం` అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, సమర్పణ: శ్రీమతి బి.సుధారెడ్డి, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు -దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.