close
Choose your channels

'పద్మ' పాత్రలో ప్రేక్షకుల గుండెల్లో విన్నర్ గా నిలవనున్న వెన్నెల కిషోర్

Wednesday, February 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ మధ్య కాలంలో కమెడియన్ వెన్నెల కిషోర్‌ హిలేరియస్ గా నవ్వించిన చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, మ‌జ్ను లాంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విచారు. తనదైన డైలాగ్ పంచ్‌ల‌తో... తనదైన మాడ్యులేష‌న్స్ తో... కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యనటుడు వెన్నెల కిషోర్‌.. విన్నర్ చిత్రంలోనూ ప‌ద్న పాత్ర‌లో న‌వ్వించబోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన పాత్ర‌ల‌కి విభిన్నంగా దర్శకుడు గోపిచంద్ మలినేని మరో అద్భుతమైన కామెడీ పాత్రను రాసారు.ప‌ద్మ పాత్రలో కిషోర్ క‌డుపుబ్బ న‌వ్వించారు.. విన్నర్ చిత్రంలో వ‌ద్మ క్యారెక్టర్ తప్పకుండా కొత్త‌గా వుంటుంది అంతేకాదు న‌వ్వుల వ‌ర్షం కురిపిస్తుంది.

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు
ఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అన‌గా ఈ శుక్ర‌వారం అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.