close
Choose your channels

విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో కలైపులి థాను నిర్మిస్తున్న 'స్కెచ్'

Sunday, April 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`శివ‌పుత్రుడు`, `అప‌రిచితుడు` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. `ఇంకొక్క‌డు` చిత్రంతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `స్కెచ్‌`. ఇంతకు మునుపు ఎప్పుడూ లేన‌ట్టుగా `స్కెచ్‌`లో గ‌డ్డంతో, కొత్త లుక్‌తో క‌నిపిస్తున్నారు చియాన్‌ విక్ర‌మ్‌. ఆయ‌న ప‌క్క‌న తొలిసారిగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఆడిపాడ‌నుంది. తెలుగు, త‌మిళంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి య‌స్‌.థాను స‌మ‌ర్పిస్తున్నారు. మూవింగ్ ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తోంది. విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
సోమ‌వారం విక్ర‌మ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని క‌లైపులి య‌స్‌. థాను మాట్లాడుతూ `` విజ‌య్ చంద‌ర్ చెప్పిన క‌థ థ్రిల్లింగా అనిపించింది. విక్ర‌మ్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే రీతిలో ఉంది. ఈ క‌థ‌లోని ఇంటెన్సిటీ న‌చ్చి గ‌డ్డంతో విక్ర‌మ్ కొత్త లుక్‌ను షేప‌ప్ చేసుకున్నారు. విక్ర‌మ్ ప‌క్క‌న త‌మ‌న్నా తొలి సారి న‌టిస్తోంది. ర‌ష‌స్ చూశాక తెర‌మీద వీరిద్ద‌రి జంట త‌ప్ప‌కుండా హిట్ పెయిర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వ‌చ్చింది. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళంలో ఒకే సారి తెర‌కెక్కిస్తున్నాం. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా సంస్థ నిర్మించిన గ‌త చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోకుండా భారీ బ‌డ్జెట్‌తో, ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. క‌థ‌, స్క్రీన్‌ప్లే, లొకేష‌న్లు, పాట‌లు అన్నీ హైలైట్ అవుతాయి. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ప్రేక్ష‌కుడికి విందుభోజ‌నంలాంటి సినిమా అవుతుంది`` అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: య‌స్‌.య‌స్‌.థ‌మ‌న్‌, కెమెరా: సుకుమార్‌, ఆర్ట్: మాయ పాండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.