close
Choose your channels

జూలై మూడోవారంలో 'వినోదం 100%' ఆడియో విడుదల

Saturday, July 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం వినోదం 100%`. ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్‌ మరియు ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియో ఆవిష్కరణ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత పొట్నూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..100% వినోదం పంచే అద్భుతమైన చిత్రమిది. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ నటన, కామెడీ ఈ చిత్రానికి హైలెట్‌ గా ఉంటుంది. ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై మూడవ వారంలో ఆడియో ఆవిష్కరణ జరిపి, వెంటనే మూవీని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..` అన్నారు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్య తారాగణం.
సాంకేతిక నిపుణులు:సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కథ: జయకుమార్‌, మాటలు: అంజన్‌, పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్‌,కృష్ణచిన్ని, కెమెరా: మల్లిఖార్జున్‌, ఎడిటింగ్‌: రాంబాబు, నిర్మాత: పొట్నూరి శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.