close
Choose your channels

విశాల్ 'విల‌న్‌' గా వ‌చ్చేస్తున్నాడు..

Tuesday, September 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ విల‌న్‌గా క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిందే.

మ‌రో విష‌య‌మేమంటే విశాల్ ఈ సినిమాలో డాక్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌. బబ్లీ బ్యూటీ హ‌న్సిక విశాల్ క్లాస్ మేట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే తెర‌పై విల‌న్స్‌ను చిత‌గొట్టిన విశాల్ తొలిసారి విల‌న్‌గా చేయ‌నుండం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతుంది.

ఈ చిత్రానికి విల‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సెప్టెంబ‌ర్ 14న విశాల్ తుప్ప‌రివాల‌న్ విడుద‌ల‌వుతుండ‌గా రెండు వారాల వ్య‌వ‌ధిలో విల‌న్ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.