close
Choose your channels

'విఠలాచార్య' షురూ..

Thursday, June 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విఠ‌లాచార్య చాలా గొప్ప ద‌ర్శ‌కులు. ఆయ‌న పేరుతో సినిమా స్టార్ట్ చేయడం బావుంది. ఈ చిత్రంలో పెద్ద మ‌న‌వ‌డు న‌వీన్‌తో పాటు చిన్న మ‌న‌వ‌డు కూడా నించ‌డం ఆనందంగా ఉంద‌ని శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల తెలిపారు. డా. న‌రే్శ్ వి.ఎ., న‌వీన్ విజ‌య కృష్ణ‌, అనీష ఆంబ్రోస్‌, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా `విఠ‌లాచార్య‌`. సుహాస్ మీరా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్‌.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్‌.టి.యువ‌రాజ్‌, యం.వి.కె.రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కృష్ణ క్లాప్‌నిచ్చారు. విజ‌య‌నిర్మ‌ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బి.గోపాల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా బ్రోచ‌ర్స్ ను కోదండ‌రామిరెడ్డి విడుద‌ల చేసి కృష్ణ‌కు అందించారు.

నేను విఠ‌లాచార్య ద‌గ్గ‌ర ఇద్ద‌రు మొన‌గాళ్లు అనే సినిమాకు ప‌నిచేశాను. ఆయ‌న చాలా హిట్ చిత్రాల‌ను తీశారు. స‌క్సెస్‌కి నాంది ప‌లికే సినిమా ఇది. న‌రేశ్‌, న‌వీన్ క‌లిసి చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానని కృష్ణ చెప్పారు. సినిమా వైవిద్యంగా సాగుతుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. మంచి పాత్ర‌లో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని అనీషా అంబ్రోస్ అన్నారు.

నా కెరీర్ జ‌స్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. భవిష్య‌త్తులో నా సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డేలా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటాను. సుహాస్ చాలా మంచి క‌థ చెప్పారని న‌వీన్ విజ‌య్‌కృష్ణ అని తెలిపారు. ప్ర‌తి సీనూ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తి పాత్రా ప్రాముఖ్య‌త ఉన్న‌దే. ఇందులో నా ఇద్ద‌రు కుమారులు న‌టిస్తున్నారు. మాస్‌, ఫ్యామిలీ, యూత్‌, కాన్సెప్ట్ ఇది. ఇందులో మా అమ్మ‌గారు కూడా న‌టిస్తున్నారని సీనియ‌ర్ హీరో న‌రేష్ తెలిపారు.

పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, సితార‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, శివ‌న్నారాయ‌ణ‌, గిరిధ‌ర్‌, మ‌ధు నంద‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, జోగి కృష్ణంరాజు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: దాశ‌ర‌థి శివేంద్ర‌, సంగీతం: స‌త్య క‌శ్య‌ప్‌, ఎడిట‌ర్‌: కార్తికా శ్రీనివాస్‌, ఆర్ట్: వినోద్ వ‌ర్మ‌, స్టంట్స్: జాషువా, డాన్స్: నిక్స‌న్‌, యాని, పాట‌లు: పూర్ణాచారి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.