close
Choose your channels

'క్వీన్ ' గా తమన్నా స్థానంలో ఎవరంటే...?

Wednesday, June 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్‌లో కంగ‌నార‌నౌత్ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందిన చిత్రం క్వీన్‌`. ఈ చిత్రంలో కంగ‌నా అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రంతో కంగనా నెంబ‌ర్‌వ‌న్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేయాల‌ని రెండేళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

`క్వీన్` చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో రేవ‌తి డైరెక్ట్ చేయ‌నుండ‌గా, సుహాసిని డైలాగ్స్ అందించ‌నున్నారు. త‌మిళంలో హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా, త‌మ‌న్నా ఎందుక‌నో రీమేక్‌లో న‌టించ‌డానికి నో చెప్పేసింది. ఇప్పుడు నిర్మాత‌లు త‌మ‌న్నా స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.