close
Choose your channels

పవన్ అంత రిస్క్ చేయడా?

Tuesday, March 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తోన్న `కాట‌మ‌రాయుడు` షూటింగ్ చివ‌రి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌లో ప‌వ‌న్ తొలిసారి క‌నిపించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. సెంటిమెంట్..యాక్ష‌న్..ఫ‌న్ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాగా తెర‌కెక్కుతోన్న చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ సినిమా `వీర‌మ్` కు రీమేక్ గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ లో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కు ముందు గుండెల్ని పిండి చేసే ఓ సెంటిమెంట్ స‌న్నివేశం ఉంటుంది.
గాయ‌ప‌డిన హీరోయిన్ భుజాల‌పై ఎత్తుకుని హాస్పిట‌ల్ లో అడ్మిట్ చేస్తాడు హీరో. ఆ స‌మ‌యంలో ఇరువురి మ‌ధ్య పండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. మాతృక‌లో ఈ సీన్ బాగా పండింది. దీంతో తెలుగులోనూ ఈ సీన్ కంటున్యూ చేయాల‌నుకున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం అంత రిస్క్ చేయ‌డానికి సిద్దంగా లేడ‌ని స‌మాచారం. ప‌వన్ భుజానికి గ‌తంలో ట్రీట్ మెంట్ జ‌రిగింది. అధిక బ‌రువులు మోయ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు సూచించ‌డంతో ఆ సీన్ చేయ‌డం లేద‌ని యూనిట్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.