close
Choose your channels

'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

Saturday, February 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. చిత్రీక‌రించాల్సిన పాట‌ను ఈ నెలాఖ‌రున చిత్రీక‌రిస్తాం. ఫిబ్ర‌వ‌రి 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించి ఫిబ్ర‌వ‌రి 24న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి తెలిపారు.

త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. `విన్న‌ర్` అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. టైటిల్ విన్న వారంద‌రూ పాజిటివ్‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సితార సితార అంటూ సాగే పాట‌ను ఇటీవ‌ల ప్ర‌ముఖ హీరో మ‌హేశ్‌ విడుద‌ల చేశారు. ఆ పాట అన్ని చోట్లా బాగా వినిపిస్తోంది. మ‌రో ఐదుగురు సెల‌బ్రిటీలు మిగిలిన ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌ల‌నేని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.