close
Choose your channels

'విన్నర్' ట్రైలర్ విడుదల చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

Sunday, February 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న చిత్రం `విన్న‌ర్‌`. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్బంగా....

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశాను. ఈ సినిమా షూటింగ్ టైంలో గోపీచంద్‌, ఛోటాగారు తీసుకున్న కేరింగ్ మ‌ర‌చిపోలేను. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. జ‌గ‌ప‌తిబాబుగారితో నేను చేస్తున్న సెకండ్ మూవీ. ర‌కుల్ కంటే ఈసినిమాలో జెబిగారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. థ‌మ‌న్ బ్యూటీఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. అన్నీ పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. గోపీచంద్‌గారు నాలోని స్పీడ్‌ను కంట్రోల్ చేసి నాలోని బెస్ట్ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. ఛోటాగారితో నేను చేసిన ఐదో సినిమా విన్న‌ర్‌. బుజ్జిగారు, మ‌ధుగారు ఖ‌ర్చుకు వెనుకాడ‌లేదు. ఎందుకంటే క‌థ బ్యాక్‌డ్రాప్ అలాంటిది. కానీ వారు ఏం మాత్రం వెనుకాడ‌లేదు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``సాయిధ‌ర‌మ్ తేజు నా హీరో, గోపి నా డైరెక్ట‌ర్‌, బుజ్జి, మ‌ధు నా ప్రొడ్యూస‌ర్స్‌, వెలిగొండ శ్రీనివాస్ నా రైట‌ర్‌, ఛోటా నా కెమెరామెన్ ..ఇలా నా అనుకునే వాళ్ళంద‌రితో చేసిన ఈ విన్న‌ర్ సినిమా సినిమా ట్రైల‌ర్‌ను చూస్తుంటే నా సినిమా ట్రైల‌ర్ చూసినంత ఆనంద‌గానే అనిపించింది. చాలా బావుంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ ఫెంటాస్టిక్‌గా చేశాడు. ఒక మంచి క‌థ‌ను అందించిన వెలిగొండ‌కు, ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా సినిమా చేసిన నిర్మాత‌ల‌కు, డైరెక్ట‌ర్ గోపీచంద్‌కు శుభాకాంక్ష‌లు. సంతోష్‌శివ‌న్‌, జీవా, పి.సి.శ్రీరాంలు వ‌ర్క్ చేసిన సినిమాల‌ను చూడ‌గానే ప‌ట్టేస్తాం. అలా అనిపించే ఏకైక కెమెరామెన్ తెలుగులో ఛోటా కె.నాయుడుగారు.ప్ర‌తి సీన్‌ను కొత్త‌గా చూపించాల‌నుకుని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా ఆలోచించ‌కుండా బుజ్జి, మ‌ధు చాలా ఖ‌ర్చు పెట్టి చేశారు. అంద‌రి క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డింది. తేజుకు ఈ సినిమా పెద్ద స్టార్ డ‌మ్ తీసుకురావాల‌ని అనుకుంటున్నాను. గోపీకి ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాల‌ని, త‌ను ఇంత‌కు ముందు చేసిన సినిమాల‌న్నికంటే పెద్ద హిట్ కావాల‌నుకుంటున్నాను`` అన్నారు.

డైరెక్ట‌ర్ గోపీచంద్ మాట్లాడుతూ - ``తేజు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మ‌న‌కు ఎలా కావాలో అలా మౌల్డ్ అయ్యే హీరో. ఏం కావాల‌నుకుంటే అది స‌మ‌కూర్చి పెట్టే నిర్మాత‌లు. ఛోటాగారితో ప‌నిచేసే అవ‌కాశం ఈ సినిమాకు కుదిరింది. అంద‌రికీ ట్రైల‌ర్ హండ్రెడ్ ప‌ర్సెంట్ న‌చ్చ‌తుంది. నాకు, తేజుకు ఈ సినిమా నెక్ట్స్ లీగ్ మూవీ. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా ఫిబ్ర‌వ‌రి 24న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌ను, థ‌మ‌న్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గౌతంరాజుగారు, ర‌కుల్‌, జ‌గ‌ప‌తిబాబుగారు ఇలా ఎక్స్‌ట్రార్డిన‌రీ టీం కుదిరింది. డెఫ‌నెట్‌గా సినిమా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంద‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ``వెలిగొండ శ్రీనివాస్ చాలా మంచి క‌థ‌ను అందించారు. సినిమా చాలా కొత్త‌గా ఉండాలి, ఎక్క‌డా కాంప్రమైజ్ కావ‌ద్ద‌ని నిర్మాత‌లు చెప్ప‌డంతో మేం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. హార్స్ రేసుల కోసం దుబాయ్‌, ట‌ర్కీ, బ‌ల్గేరియాల‌న్నీ సెర్చ్ చేశాం. ట‌ర్కీలో సినిమా చేద్దామ‌ని నిర్మాత‌లు సినిమాపై త‌మ ప్యాషనేంటో చెప్పారు. గోపీచంద్ చాలా మొండోడు. త‌న‌తో క‌లిసి పనిచేయాల‌ని చాలా కాలంగా అనుకున్నాను. ఈ సినిమాకు ఆ అవ‌కాశం క‌లిగింది. హీరో తేజు చాలా రిస్క్‌తో ఈ సినిమాను చేశాడు. థ‌మ‌న్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు`` అన్నారు.

వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``డాన్ శీను, బ‌లుపు చిత్రాల‌కు నేను గోపీచంద్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. ఈ సినిమాకు తేజు క‌ష్టం మామూలు విష‌యం కాదు. ట్రైల‌ర్ చూశాను. చాలా బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్: ప్ర‌కాష్‌, ఫైట్స్: ర‌వివ‌ర్మ‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.