close
Choose your channels

'యువర్స్ లవింగ్లీ' మోషన్ పోస్టర్ రిలీజ్

Thursday, July 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ". నిర్మాతగా, కథానాయకుడిగా పృద్వీ పొట్లూరికిది తొలి చిత్రం. పృద్వీ పొట్లూరి సరసన సౌమ్య శెట్టి నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని.. "యువర్స్ లవింగ్లీ" అనే టైటిల్ లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని.. అందరూ కొత్తవాళ్లతో రూపొందించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాని రాజ్ కందుకూరి అన్నారు.

"పెళ్లి చూపులు" చిత్రంతో సంచలన విజయం అందుకున్న రాజ్ కందుకూరి చేతుల మీదుగా తమ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కావడం పట్ల చిత్ర దర్శకులు జో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తూ.. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న పృద్వీ పొట్లూరికి ఉజ్వల భవిష్యత్తు ఉందని జో అన్నారు. విడుదలయ్యాక "యువర్స్ లవింగ్లీ" చిత్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని.. పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ సినిమాకు వెళ్తారని, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జో అన్నారు.

బులుబుల్, అనిల్, గోవింద్, సాయి పవన్, వెంకటేష్, సాయి తేజ, ప్రియ, మేఘన, బృంద, ఎఫ్,ఎం.బాబాయ్, తులసి, దేశీరాజు, సుజాత, సంధ్య, సత్య ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: పోతుల రవికిరణ్, కూర్పు: వి.ఎస్.నాగిరెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఛాయాగ్రహణం: ప్రవీణ్ కండ్రేగుల, నిర్మాత: పృద్వీ పొట్లూరి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జో !!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.